: హైదరాబాదులో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించనున్న రణ్ బీర్ కపూర్


హైదరాబాదులో వచ్చే నెల 14 (చిల్డ్రన్స్ డే)న ప్రారంభం కానున్న 18వ అంతర్జాతీయ చిన్నారుల చలన చిత్రోత్సవాల పండుగను బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ ఈ విషయం తెలిపారు. రణ్ బీర్ ప్రారంభించడం వల్ల వారం పాటు జరిగే ఉత్సవాలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. 70 దేశాల నుంచి 900 చలనచిత్రాలు రాగా.. ఉత్తమమైన 200 చిన్నారుల చిత్రాలను ప్రదర్శించి వాటిలో అత్యుత్తమమైన వాటిని అవార్డులకు ఎంపిక చేయనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షన్నర మంది చిన్నారులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు రానున్నారని శ్రవణ్ చెప్పారు.

  • Loading...

More Telugu News