: మాల్దీవుల్లో భారత హై కమిషనర్ కారుపై దాడి
మాల్దీవుల్లో భారత హై కమిషనర్ రాజీవ్ షహరే కారుపై దాడి జరిగింది. అక్కడి భారత హై కమిషన్ కార్యాలయం ఎదుట ఆపి ఉన్న కారుపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాంతో, కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో భారత హై కమిషనర్ తన కార్యాలయం లోపల ఉన్నారు. ఘటనను ఖండించిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్.. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.