: కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం
బెనడిక్ట్-16 పోప్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త పోప్ ను ఎంపిక చేసే ప్రక్రియకు నేడు శ్రీకారం చుట్టారు. పోప్ ఎన్నిక తేదీ ఖరారు చేసేందుకు కార్డినల్స్ నేడు వాటికన్ సిటీలో సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 115 మంది కార్డినల్స్ ఈ క్రతువులో పాల్గొంటారు.
కాగా, స్కాట్లాండ్ కు చెందిన కార్డినల్ కీత్ ఓబ్రియాన్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయనపై గతవారం స్వలింగ సంపర్కం ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓబ్రియాన్ వాటిని అంగీకరించడంతో పోప్ ఎంపికకు ఆయనను పక్కనబెట్టినట్టు స్పష్టమవుతోంది. ఈ విషయంపై వాటికన్ వర్గాలు విచారణకు ఆదేశించనున్నాయి.