: నేడు బాబ్లీ గేట్ల మూసివేత
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ రోజు మూతపడనున్నాయి. ఈ మూసివేత కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ హాజరవుతున్నారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు 14 గేట్లను కిందకు దించేయనున్నారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. అక్టోబరు 29వ తేదీనుంచి బాబ్లీ గేట్లు దించుకోవచ్చని సుప్రీంకోర్టు గత ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. 2.74 టీఎంసీల కెపాసిటీ గల బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్ల వ్యయంతో నిర్మించింది.