: సరికొత్త స్కానర్ వస్తోంది!


మన శరీరంలో సమస్య, రుగ్మత ఎక్కడ వున్నాయో నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఆర్‌ఐ స్కానర్ ను వైద్య చరిత్రలో ఓ అత్యద్భుత ఆవిష్కారంగా చెప్పుకోవాలి. ఇప్పుడీ విషయంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రాన్ని ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఇందులో ఓ సూపర్‌ కండక్టింగ్‌ మాగ్నెట్‌ ఉంటుంది. ఇది 11.75 టెస్లాల ఫీల్డ్‌ స్కానర్‌ను తయారు చేయగలుగుతుంది. మనిషి మెదడులోని భాగాలను మరింత నిశితంగా పరిశీలించడం దీని ద్వారా సాధ్యం అవుతుందని చెబుతున్నారు రూపకర్తలు.

ఈ సరికొత్త ఎంఆర్‌ఐ స్కానర్‌ ద్వారా 0.1 మిల్లీమీటర్ల రిజల్యూషన్‌ను, 1000 న్యురాన్ల పరిధిని కలిగి ఉంటూ సెకన్లో పదోవంతు టైంలోనే పని పూర్తి చేస్తుందిట. అయితే ఈ సూపర్‌ ఎంఆర్‌ఐ స్కానర్‌ సేవలను స్వీకరించాలంటే మాత్రం మరో ఏడాది ఆగాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాదికి గానీ దీని తయారీ పూర్తికాదు అని ఈ ప్రాజెక్టు చీఫ్‌ ఫ్రెంచ్‌ ఆల్టర్నేటివ్‌ ఎనర్జీస్‌ అండ్‌ అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ డైరక్టర్‌ పియరీ వెద్రిన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News