: షేపులు మార్చుకునే సరికొత్త 4డి ప్రింటింగ్‌


ప్రింటింగ్‌ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక విప్లవాలు వచ్చేస్తూనే ఉన్నాయి. త్రీడీ ప్రింటింగ్‌, సువాసనలు వెదజల్లే ప్రింటింగ్‌ ఇలా రకరకాలు వచ్చాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు 4డి ప్రింటింగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో ముందుగా ఒక షేప్‌లో ఉంటూ, ఆ తర్వాత మరో షేప్‌లోకి మారే వస్తువుల తయారీకి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కొలరాడో యూనివర్సిటీ, సింగపూర్‌ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీలోనే షేప్‌ మెమొరీ పాలిమర్‌ ఫైబర్లను అమర్చి ఈ కొత్త విప్లవాన్ని కార్యరూపంలోకి తెచ్చారు. ఇందులో ఇంకా సుదీర్ఘ పరిశోధనలు సాగాల్సి ఉన్నదని దీనికి నేతృత్వం వహించిన మార్టిన్‌ డన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News