: ఉత్తర కొరియాలో తల దువ్వుకోవడంపై ఆంక్షలు.. !
నవ్విపోదురుగాక మాకేటి.. అంటూ ఉత్తర కొరియా పాలకులు విచిత్రమైన ఆంక్షలు విధించారు. ప్రజలు తాము చెప్పిన విధంగానే తల దువ్వుకోవాలని హుకుం జారీ చేశారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఈ విధివిధానాలను ప్రకటించారు. పైగా, ఎన్నిరకాలుగా తల దువ్వుకోవాలో నిర్ణయించారు. మహిళలు 18 రకాలుగా, పురుషులు 10 రకాలుగా తల దువ్వుకోవాలట. పాపం, కొరియా వాసులకు ఎన్నికష్టాలో కదూ!.