: క్షయ ఉన్నదో లేదో గంటల్లో తేల్చేస్తారు
క్షయ వ్యాధిని నిర్ధారించాలంటే ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. ఇందులో ఛాతీకి ఎక్స్‌రే తీయడం, మైక్రోస్కోపు ద్వారా కొన్ని పరీక్షలు చేయడం... ఇవన్నీ మిళితమై ఉంటాయి. వీటిని క్రోడీకరించి క్షయ సోకిందో లేదో తేలుస్తారు. అయితే ఇంత సుదీర్ఘమైన ప్రక్రియకు చెక్ చెబుతూ గంటల్లో వ్యాధిని నిర్ధారించేసే ప్రక్రియను వైద్యులు కనుగొన్నారు. కఫం పరీక్ష ద్వారా దీనిని వెంటనే తేల్చేయవచ్చునని అంటున్నారు.
ఎక్స్‌పర్ట్ ఎంఈబీ/ ఆర్‌ఐఎఫ్ అని పిలిచే ఈ పరీక్షలో రెండు గంటల్లో విషయం ఒక కొలిక్కి వస్తుందిట. రోగ లక్షణాలను 744 మందిపై పరీక్షలు చేసి మరీ ఈ విషయాన్ని వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. మామూలు పద్ధతిలో పరీక్షలు చేస్తోంటే, అసలు చేయించుకున్న వారు ఫలితాలు తెలుసుకోవడానికి కూడా రావడం లేదని.. అందువల్ల చికిత్సలు చేయించుకోవడం లేదని.. ఇందులో అయితే వెంటనే వ్యాధి సంగతి తేలుతుంది కాబట్టి జాగ్రత్త పడతారని వారు సెలవిస్తున్నారు.