: కేరళ సీఎంను ఫోనులో పరామర్శించిన రాష్ట్రపతి, ప్రధాని


నిన్న ఎల్డీఎఫ్ కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు ఫోనులో పరామర్శించారు. అధికారులు ఈ విషయం తెలిపారు. చాందీపై రాళ్ల దాడికి సంబంధించి కేరళ పోలీసులు మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకోగా, దాదాపు వెయ్యి మంది మీద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News