: తీవ్రవాది మక్బూల్ శిక్ష తగ్తింపు ఉత్తర్వులు రద్దు


ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాది సయ్యద్ మక్బూల్ కు గతంలో శిక్ష తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సంబంధిత పత్రాలపై సంతకం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు సమాచారం. మక్బూల్ 1999లో నిజామాబాద్ వద్ద ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 2004 నుంచి 2009 అక్టోబరు వరకు జైల్లోనే ఉన్నాడు.  ప్రస్తుతం మక్బూల్ దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News