: పడవలో కాలుజారిన చిరంజీవి
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి చిరంజీవికి ఊహించని ప్రమాదం ఎదురైంది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో పడవ ఎక్కుతూ ఆయన కాలుజారి కింద పడ్డారు. చిరంజీవితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కన్నబాబు, జిల్లా మంత్రి తోట నరసింహం ఒకేసారి పడవపైకి ఎక్కడంతో పడవ పక్కకు ఒరిగిపోయింది. దీంతో చిరంజీవితో పాటు మిగతా వారందరూ నీటిలో పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిని పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. అనంతరం పడవలోని నీటిని తొలగించారు. అనంతరం తిమ్మాపురం పేటకాలువ గట్టుకు చిరంజీవి పర్యటన కొనసాగింది.