: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై బీజేపీ కరప్రతం విడుదల
ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ తనదైన శైలిలో అస్త్రాలను సంధిస్తోంది. ఈ మేరకు కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న హస్తం ప్రభుత్వాల పాలనపై కరపత్రాన్ని విడుదల చేసింది. న్యూఢిల్లీలోని కమలం కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఈ పత్రాన్ని విడుదల చేశారు. కాంగ్రెస్ సర్కార్ లు అవినీతికి పాల్పడుతున్నాయంటూ అందులో ఆరోపించింది. దేశంలో ఐదు రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పార్టీ ఎన్నికల సమన్వయ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.