: సోనియాకు 1500 కోట్లు కప్పం కట్టిన జగన్ : గాలి ముద్దుకృష్ణమ


లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ సోనియాకు కప్పం కట్టి బెయిలు మీద బైటకొచ్చాడని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం జగన్ రూ. 1500 కోట్లు సోనియాకు కప్పంగా కట్టాడని ఆరోపించారు. అందుకే జగన్ కు బెయిల్ వచ్చిందని మండిపడ్డారు. విభజన అనే విషవృక్షాన్ని వైఎస్ నాటితే, సోనియా పెంచి పోషించిందని... ఇప్పుడు జగన్ దానికి ముగింపు పలుకుతున్నాడని గాలి ఆరోపించారు. తన శంఖారావం సభలో పదే పదే 'అడగదలుచుకున్నా, అడగదలుచుకున్నా' అన్న జగన్.. రాష్ట్ర విభజనపై 1999లోనే తన తండ్రిని ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News