: 'తెలంగాణ'.. అప్పడాలు, దోసెలు వేసినంత సులువుకాదు: వాయలార్ రవి


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం అంటే.. అప్పడాలు, దోసెలు వేసినంత సులభం కాదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి వ్యాఖ్యానించారు. అందుకు కొంత సమయం పడుతుందని, వేచి చూడాలని సలహా ఇచ్చారు.

తెలంగాణ అంశం రాజకీయ పార్టీలకంటే మీడియాకే పెద్ద సమస్యగా ఉన్నట్టుందని ఆయన అన్నారు. ప్రతి రోజు తెలంగాణపై చర్చించలేమని కూడా వాయలార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ డిమాండ్ పై చర్చల ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News