: రెబల్ స్టార్ కృష్ణంరాజు మళ్లీ బీజేపీలోకి?
నటుడు కృష్ణంరాజు మళ్లీ బీజేపీలో చేరనున్నారా? ఆయన తాజాగా బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలుసుకోవడంతో బీజేపీలో చేరనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కృష్ణంరాజు 1999, 2004లో కాకినాడ, నర్సాపురం స్థానాల నుంచి బీజేపీ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో బీజేపీ ఓటమి పాలవడంతో పార్టీకి దూరమయ్యారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా దేశవ్యాప్తంగా మోడీ పవనాలు వీస్తుండడంతో బీజేపీలో చేరి పదవిని సొంతం చేసుకోవాలని కృష్ణంరాజు ఆశపడుతున్నట్లు తెలుస్తోంది.