: హెక్టారుకు రూ. 50 వేల నష్ట పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు
భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని తెదేపా నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుకు హెక్టారుకు రూ. 50 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. అలాగే, ఇళ్లు కోల్పోయిన వారికి లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.