: చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి భరోసా


ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రకాశం జిల్లా చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీరాలలోని నీట మునిగిన చేనేత గృహాలు, మగ్గాలను పరిశీలించారు. అంతకుముందు పత్తి, మిరప పంట నష్టాలను పరిశీలించేందుకు సీఎం కారంచేడు బయలుదేరుతుండగా ప్రజలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News