: రాహుల్ కంటే దిగ్విజయే నయమన్న సుష్మా
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఒకరి వ్యాఖ్యలకు మరొకరు దీటుగా స్పందించారు. మోడీ సరైన నేత కాదని, సుష్మాస్వరాజ్ వంటి మంచి నేతను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎందుకు పోటీకి దింపదంటూ దిగ్విజయ్ ప్రశ్నించారు. దీనికి సుష్మా బహుచక్కగా బదులిచ్చారు. రాహుల్ కంటే దిగ్విజయ్ సింగ్ ఉత్తమ అభ్యర్థి అని తాను భావిస్తున్నట్లు ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుష్మాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ దిగ్విజయ్ అనడం ఇదే మొదటి సారి కాదు.