: మోపిదేవికి బెయిల్ మంజూరు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ముగిసినందున బెయిల్ కు మోపిదేవి అర్హుడని భావించిన కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అయితే, కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని మోపిదేవికి షరతు విధించింది. ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. జగన్ కేసులో గతేడాది మే 25న అరెస్టైన మోపిదేవి పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్య కారణాలతో గతంలో కోర్టు నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన బయట ఉన్నారు. గడువు ముగియడంతో కొన్ని రోజుల కిందట మోపిదేవి కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే బెయిల్ పిటిషన్ వేశారు. కాగా, జగన్ కేసులో ఇప్పటిదాకా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మినహా అందరకి బెయిల్ లభించడం విశేషం.