: ఒక్కోకోతికి రూ.5వేలు ఇస్తున్న ఇండోనేషియా ప్రభుత్వం


ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పుడు కోతులను వేటాడుతోంది. రాజధాని జకార్తా వీధుల్లో కోతుల ప్రదర్శనలు ఎక్కువైపోవడమే అసలు సమస్య. కోతులను ఆడిస్తూ పొట్టపోసుకుంటున్న వారు జకార్తాలో పెరిగిపోతున్నారు. కోతులపై హింస, వాటి ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కనిపించిన కోతులను తీసుకెళ్లిపోతున్నారు. ఒక్కో కోతికి సుమారుగా 5వేల రూపాయలు చెల్లించి వాటిని తీసుకెళ్లి జకార్తాలోని రగునాన్ జూలో ఉంచాలని అక్కడి సర్కారు నిర్ణయించింది. కోతులను ఆడించేవారికి వేరే వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News