: రైతులను కేంద్రం ఆదుకుంటుంది: చిరంజీవి హామీ
ఐదు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటిస్తున్న చిరంజీవి అక్కడికి చేరుకున్న అనంతరం పైవిధంగా మాట్లాడారు. వరద ప్రాంతాల్లోని పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు.