: పాక్ సైన్యం కాల్పుల్లో భారత సైనికాధికారి మృతి
పాక్ తన కుక్క తోక వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి తుంగలో తొక్కింది. యూరి సెక్టార్ లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మన సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మృతి చెందారు. కాల్పులు జరపడం ద్వారా చొరబాటుదారులను మన దేశంలోకి జొప్పించడానికి పాక్ ఆర్మీ ప్రయత్నించిందని భారత సైనికాధికారి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 130 సార్లకు పైగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.