: నేడు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అనంతరం ఆయన ఈ రెండు జిల్లాల్లో చేపడుతున్న సహాయ పునరావాస చర్యల్ని సమీక్షిస్తారు. పంటలు నష్టపోయిన పొలాల్నీ, వరద బాధిత ప్రాంతాల్నీ పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం ఇక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో ప్రకాశం జిల్లా బయలుదేరి వెళ్తారు. ఈ జిల్లాలో పర్యటన అనంతరం గుంటూరు జిల్లా బయలుదేరి వెళ్తారు.

  • Loading...

More Telugu News