: ఇక మన సమాచారం భద్రంగా ఉంటుంది


మనం సమాచారాన్ని భద్రంగా ఉంచాలంటే ఏం చేస్తాం... ఒకప్పుడైతే తమకు సంబంధించిన ఎలాంటి సమచారాన్నైనా ఏ పుస్తకంలోనో, లేదా ఏదైనా పేపర్‌లోనో రాసి దాన్ని భద్రంగా దాచి ఉంచేవారు. అది పాడైపోయినా, లేదా దాన్ని చెదలు కొట్టేసినా ఇక అందులోని సమాచారం మనకు తెలిసే అవకాశమే లేదు. ఆ తర్వాత కాలం మారింది. ఇప్పుడు ఎలాంటి సమాచారాన్నైనా చక్కగా కంప్యూటర్‌లోనే తయారుచేసి దాన్ని చక్కగా డిస్క్‌లో భద్రంగా ఉంచడం జరుగుతోంది. ఇది పేపర్‌తో పోల్చుకుంటే కాస్త భద్రమైందే. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కంప్యూటర్‌ ద్వారా ఇందులోని సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది.

అయినా ఇలాంటి డిస్క్‌లు కూడా ఒక్కోసారి పాడైపోయే ప్రమాదముంది. దీంతో అందులో మనం నిల్వ చేసి ఉంచిన సమాచారం మొత్తం తెలియకుండా పోయే ప్రమాదముంది. ఈ నేపధ్యంలో మన డేటాను నిల్వ చేసుకునేందుకు దాదాపుగా నాశనం చేయడానికి వీలులేని ఒక సరికొత్త తరహా డిస్క్‌ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నెదర్లాండ్స్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరించారు. ఈ డిస్క్‌ను ఏ విధంగాను నాశనం చేయలేమని వీరు చెబుతున్నారు. దీనిలో మనం నిల్వ చేసుకున్న సమాచారం భద్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News