: ఈ అద్దానికి చీకటైనా పరవాలేదు


అద్దంలో చూసుకోవాలంటే చక్కటి వెలుతురు వుండాలి. అప్పుడే మన ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది. అలాకాకుండా చీకటిలో చూస్తే ఏమీ కనపడదు. అయితే చీకటిలో కూడా మన ప్రతిబింబాన్ని చూసుకోగలిగే సరికొత్త అద్దాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ అద్దం చీకటిలో అయినా మన ముఖాన్ని చక్కగా చూపించడమే కాదు... చక్కగా మన ముఖంలో ఎక్కడ మేకప్‌ ఎక్కువగా ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో ఇట్టే చెప్పేస్తుందట.

సెన్సర్లలతో పనిచేసే ఈ అధునాతనమైన అద్దానికి ఎదురుగా మనం నిల్చోగానే దానికి అమర్చివున్న లైట్లు వాటంతట అవే వెలుగుతాయి, మీ మేకప్‌లోని లోటుపాట్లను మీకు తెలియజేస్తాయి. అంతేకాదు దీన్ని వెనక్కి, ముందుకు అడ్జస్ట్‌ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ ముఖాన్ని మొత్తం ఒకేసారి చూసుకునేలా జూమ్‌ చేసుకునే వీలుంది. అచ్చు మన సెల్‌ఫోన్‌లాగా దీన్ని ఒకసారి రీఛార్జి చేసుకుంటే చాలు చక్కగా పనిచేస్తుందట. మొత్తానికి ఈ అద్దం భలే బాగుందికదూ...!

  • Loading...

More Telugu News