: ట్విట్టరే ఫస్టుట!


ఇప్పుడు ఎక్కువగా యువత ఆన్‌లైన్‌లో స్నేహితులతో గడపడానికి మొగ్గు చూపుతోంది. బయట స్నేహితులతో కాలక్షేపం చేయడానికి వీలుకాకపోతే, ఆన్‌లైన్‌లో స్నేహితులతో మాట్లాడడానికి ఇప్పుడు బోలెడు మార్గాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఇలాంటి మార్గాల్లో ముందుగా ఫేస్‌బుక్‌ వచ్చింది. దీంతో యువత ఏమాత్రం కాస్త వీలు చిక్కినా వెంటనే ఫేస్‌బుక్‌ మీద వాలిపోవడం మొదలెట్టారు. ఆ తర్వాత వచ్చిన ట్విట్టర్‌ ఫేస్‌బుక్‌ను పక్కకు తోసేసేలా చేసింది. దీంతో ఎక్కువమంది ట్విట్టర్‌ ద్వారా తమ భావాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఫేస్‌బుక్‌కన్నా కూడా యువత ట్విట్టర్‌నే ఎక్కువగా ఆదరిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. పైపర్‌ జెఫ్రే అనే అధ్యయనవేత్త నిర్వహించిన అధ్యయనంలో నేటి యువతరంలో 26 శాతం మంది ట్విట్టర్‌కు మద్దతు తెలుపగా ఫేస్‌బుక్‌కు 23 శాతం మంది తమ ఓటేశారట. అంటే ఫేస్‌బుక్‌తో పోల్చుకుంటే ట్విట్టర్‌ చాలా సౌకర్యవంతంగా ఉందని యువత భావిస్తోందన్నమాట.

  • Loading...

More Telugu News