: రైతులకు పరిహారం ఇచ్చేవరకు రాజీలేని పోరాటం చేస్తా: చంద్రబాబు
వరద బాధిత రైతులకు పరిహారం ఇచ్చేవరకు రాజీలేని పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పర్యటించిన ఆయన నష్టపోయిన రైతులకు హెక్టార్ మొక్కజొన్నకు రూ. 25 వేల చొప్పున, వాణిజ్య పంటలకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ. 5 వేల పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. అవినీతి పార్టీలకు ఓటు వేయవద్దని యువతకు పిలుపునిచ్చారు.