: రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఐపీఎస్ ల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎస్పీ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మొత్తం 44 మంది ఉన్నారు. 11 జిల్లాల ఎస్పీలు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏఆర్ అనురాధ, వీవీ శ్రీనివాసరావు, ఉమేష్ షరాఫ్, యోగానంద్, జితేందర్, ఏఎస్ కే దాస్, శివప్రసాద్, గంగాధర్, దామోదర్, సూర్యప్రకాశరావు, డీఎస్ చౌహాన్ లు ఉన్నారు. ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ని టీటీడీ ముఖ్య భద్రతా అధికారిగా నియమించారు.