: జర్మనీ చాన్సలర్ పై పదేళ్ళుగా అమెరికా గూఢచర్యం


అగ్రరాజ్యం అమెరికా గత దశాబ్ద కాలంగా జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పై గూఢచర్యానికి పాల్పడుతోందన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. జర్మనీ పత్రిక 'డెర్ స్పీగెల్' ఓ కథనం ప్రచురించింది. దీంతో, జర్మనీ ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాయి. నిగ్గు తేల్చేందుకు వెంటనే జర్మనీ ఇంటలిజెన్స్ బృందాలు అమెరికా పయనం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ బృందంలో జర్మనీ దేశీయ, విదేశీ నిఘా సంస్థల అధిపతులు కూడా ఉన్నారు. మెర్కెల్ ఫోన్ ను గత పదేళ్ళుగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ట్యాప్ చేస్తోందని 'డెర్ స్పీగెల్' పేర్కొంది. ఈ ఆరోపణల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకే తమ అధికారులను వాషింగ్టన్ పంపుతున్నామని జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కాగా, గూఢచర్య వ్యవహారం నిజమని తేలితే ఈ రెండు మిత్రదేశాల మధ్య దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News