: ఈ నెల 7న తమిళనాట 'విశ్వరూపం' విడుదల
కమల్ హాసన్ రూపొందించిన 'విశ్వరూపం' చిత్రం అడ్డంకులను అధిగమించి ఈ నెల 7న తమిళనాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని నేడు చెన్నైలో కమలహాసన్ మీడియాకు తెలిపారు. తనకు ఆర్ధిక ఇబ్బందులున్నాయని తెలియడంతో, పలువురు అభిమానులు చెక్కులు, డీడీలను పంపించారనీ, అయితే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని తిరిగి పంపుతున్నామని కమల్ చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చిత్రంపై నిషేదం విధించడం, తర్వాత ఆ సంఘాలతో కమల్ చర్చించి సమస్యను పరిష్కరించుకోవడం తెల్సిందే.