: వైఎస్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో వెలివేశారు: మంద కృష్ణ
తెలంగాణ ప్రజలు వైఎస్ కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని ఎప్పుడో వెలివేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ, జగన్ అసలు రూపాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాక వారూ వెలివేస్తారని తెలిపారు. వైఎస్ కుటుంబం అబద్ధాలు చెప్పే కుటుంబమని ఆరోపించారు. సీమాంధ్రలో ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీయే జగన్ ను ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కోట్ల రూపాయలు వెదజల్లి హైదరాబాదులో సభ నిర్వహించారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే ఈ సభ అని మంద కృష్ణ విమర్శించారు.