: ఇండియన్ జీపీ విజేత వెటెల్
భారత్ ఆతిథ్యమిచ్చిన ఫార్ములా వన్ రేసులో జర్మన్ రేస్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో నేడు జరిగిన మెయిన్ రేసులో వెటెల్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోజ్ బెర్గ్ ను 30 సెకన్ల తేడాతో వెనక్కినెట్టి వెటెల్ పోడియం ఫినిష్ సాధించాడు. వెటెల్ రెడ్ బుల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్ లో 2011 నుంచి ఈ ఫార్ములా వన్ రేసు నిర్వహిస్తుండగా.. వరుసగా మూడు పర్యాయాలూ వెటెల్ చాంపియన్ గా నిలవడం విశేషం. అంతేగాకుండా, ఈ ఏడాది వెటెల్ కు ఇది వరుసగా నాలుగో డ్రైవర్స్ చాంపియన్ షిప్.