: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కోర్టు వద్ద ఉద్రిక్తత


తూర్పు గోదావరి జిల్లా థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం వ్యవహారంలో బిక్కవోలు జడ్పీటీసీ పడాల రామారెడ్డి అరెస్టు ఆందోళనకు దారి తీసింది. రామారెడ్డిని ఈ మధ్యాహ్నం అరెస్టు చేసిన పోలీసులు జిల్లాలోని అనపర్తి కోర్టు నుంచి రామచంద్రాపురం సబ్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

అరెస్టును నిరసిస్తూ కొంతమంది మహిళలు, స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, రామారెడ్డిపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, రంగంపేట మండలంలోని సింగంపల్లి, బాలవరం, జి.దొంతమూరు గ్రామాల్లో పోలీసు పికెట్ ఎత్తివేశారు. 

  • Loading...

More Telugu News