: బీహార్ కీలకపాత్ర పోషిస్తే దేశంలో మార్పు వస్తుంది: మోడీ
బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న హుంకార్ సభలో మోడీ ప్రసంగం కొనసాగుతోంది. ఆయన మాట్లాడుతూ, దేశంలో మార్పు రావాలంటే బీహార్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మార్పు బీహార్ తోనే మొదలవ్వాలని ఆకాంక్షించారు. తనకు చంద్రగుప్త మౌర్యుడి రాజనీతి ఆదర్శమని పేర్కొన్నారు. ఇక, స్వాతంత్ర్య సంగ్రామంలో చంపారన్ సత్యాగ్రహం, దండి యాత్రలకు ఎంతో ప్రాముఖ్యం ఉందని అన్నారు.