: రాష్ట్రంపై వరుణుడి పంజా.. 29కి పెరిగిన మృతుల సంఖ్య
రాష్ట్రంలో నేడూ భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు ఈ రోజు మరో ఏడుగురు మరణించారు. దాంతో, మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఇప్పటివరకు ప్రకాశంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మిగతావారు ఇతర జిల్లాలకు చెందినవారు. ఇక, లక్షలాది ఎకరాల్లో పంటనష్టం చోటు చేసుకోగా, వందలాది గ్రామాలు జలమయమయ్యాయి.