: తెలంగాణ రావడం ఖాయం: డీఎస్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ రావడం ఖాయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఢిల్లీలో వేగవంతమైనట్టు తెలిపారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు సోనియాను కలిసిన ప్రతిసారీ తెలంగాణపై చర్చించినట్టు చెప్పారు.