: కిరణ్ లేఖపై తనకు తెలియదన్న దిగ్విజయ్
రాష్ట్ర విభజనపై శాసనసభకు తీర్మానం పంపే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే, లేఖ విషయం తనకేమీ తెలియదని దిగ్విజయ్ తాపీగా సమాధానమిచ్చారు. కాగా, రాష్ట్ర విభజనకు సంబంధించి పలు అభ్యంతరకరమైన అంశాలను పరిష్కరించడానికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. సీమాంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న వివాదాస్పద అంశాలపై ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరించే బాధ్యతను వాటికి అప్పగించనున్నారని సమాచారం.