: ముగిసిన మూడో రోజు ఆట.. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 74/2


హైదరాబాద్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 192 పరుగుల వెనకబడి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 503 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం 266 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు 53 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకున్నారు. ఈ రెండు వికెట్లు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కొవాన్ (26 బ్యాటింగ్) కు తోడుగా వాట్సన్ (9 బ్యాటింగ్) ఉన్నాడు.

ఆటకు మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప .. ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడం భారత్ కు లాభించే అంశం. 

  • Loading...

More Telugu News