: నవంబర్ 10న రాష్ట్రపతి డార్జిలింగ్ పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 10న పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా స్థానిక నార్త్ పాయింట్ స్కూల్ 125వ వార్షికోత్సవాలను ప్రారంభించనున్నారు. అదేరోజు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్లు డార్జిలింగ్ జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రకటనతో ప్రత్యేక డార్జిలింగ్ కోసం మళ్లీ ఉద్యమం చెలరేగిన తర్వాత రాష్ట్రపతి ఇక్కడ పర్యటించనుండడం ఇదే తొలిసారి.