: వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 29 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 3,230 గ్రామాలపై తుపాను ప్రభావం పడిందని తెలిపింది. ఈ రోజు సచివాలయంలో వర్షంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మరణించిన వారి కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావంతో ఇప్పటివరకు 6,597 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 5 లక్షల 64 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనికితోడు, 753 కి.మీ. మేర ప్రధాన రహదారులు, 181 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నట్టు వెల్లడించారు.