: అన్యాయం చేస్తే ఎదురు తిరుగుతాం: జగన్


విభజన పేరిట రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఎదురు తిరుగుతామని జగన్ హెచ్చరించారు. రాష్ట్రం రెండు ముక్కలైతే ముఖ్యంగా నీటి సమస్యలొస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేటికీ మనకు పైన ఉన్న కర్ణాటక డ్యాంలు దిగువకు నీరొదిలితేనే మనకు నీరొస్తుందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం, భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని జగన్ ప్రశ్నించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తాగడానికి నీళ్ళేవని అన్నారు. విడదీస్తే మన బాధలు చెప్పనలవిగావు అని పేర్కొన్నారు. విభజిస్తే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News