: అక్రమంగా గన్ పౌడర్ ని తరలిస్తున్న లారీ పట్టివేత
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ వద్ద గన్ పౌడర్ ను అక్రమంగా తరలిస్తున్న లారీని శనివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లారీ శ్రీకాకుళం నుంచి ఛత్తీస్ గఢ్ వస్తోండగా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వారు తెలిపారు.