: టీ జేఏసీ ఆదేశాలు మాకు వర్తించవు: మంత్రి శ్రీధర్ బాబు
తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ అనీ, తెలంగాణ రాజకీయ ఐకాసకి కాదనీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారనీ, అంత మాత్రాన తెలంగాణ రాజకీయ ఐకాస ఆదేశించినట్లుగా తాము నడుచుకోవాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డుల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. వంట గ్యాస్ కు తప్పనిసరిగా ఆధార్ సమర్పించాలన్న విషయంలో, గడువు పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.