: జగన్ వల్లే సమైక్యాంధ్ర సాధ్యమవుతుంది: ఎస్పీవై రెడ్డి


సమైక్య శంఖారావం సభలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ప్రసంగించారు. అప్పట్లో వైఎస్సార్ నీటికి అధిక ప్రాధాన్యతనిచ్చి, జలయజ్ఞం పేరిట అనేక ప్రాజక్టులు ప్రారంభించారని చెప్పారు. ఇప్పుడవన్నీ నిలిచిపోయాయని, అవి తిరిగి కార్యరూపం దాల్చాలంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవశ్యకత కనిపిస్తోందని ఎస్పీవై రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా కలిపి ఉంచడం ఒక్క జగన్ వల్లే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలందరూ జగన్ కు మద్దతివ్వాలని కోరారు.

  • Loading...

More Telugu News