: తెలంగాణ వాడినే.. విభజన కోరుకోవడం లేదు: నల్లా సూర్యప్రకాశ్


తాను తెలంగాణవాడినైనా విభజన కోరుకోవడం లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోకూడదని రాష్ట్ర ప్రజలంతా తరలి వచ్చిన సందర్భం ఇదని అన్నారు. ఒకరిద్దరు సభలో ఇబ్బందులు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తారని, అది వారి అభద్రతా భావానికి, లేకితనానికి సూచన అని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా పేదలు, దళితులు లాభపడ్డారని ఆయన గుర్తు చేశారు. ఆ పథకాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు, విద్య పొందారని తెలిపారు.

సమర్థ నాయకత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటేనే దళితులు అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. రాజశేఖరరెడ్డి లాగే సుభిక్షంగా పాలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. అలాంటి వ్యక్తి కుమారులే.. వెన్నుపోటు పొడిచిన బాబుతో జత కడుతున్నారని, జగన్ లాంటి కొడుకులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News