: సోనియా దర్శకత్వంలోనే జగన్ 'సమైక్య సభ': టీడీపీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'సమైక్య శంఖారావం' సభ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శకత్వంలోనే జరుగుతోందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కుండపోత వర్షాలతో ప్రజలు ఇక్కట్లపాలవుతున్న నేపథ్యంలో, వారికి సహాయం చేసేందుకు అన్ని పార్టీలు సహాయ పునరావాస చర్యల్లో పాల్గొంటుంటే.. వైఎస్సార్సీపీ మాత్రం జనసమీకరణ చేస్తోందని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. వరదల కారణంగా జనాలు చనిపోయి, పెద్ద ఎత్తున పంటలు కోల్పోతే.. జగన్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కాగా, హైదరాబాదులో ఏపీఎన్జీవోల సభను వ్యతిరేకించిన కేసీఆర్.. జగన్ సభ గురించి పట్టించుకోవద్దంటూ పార్టీ శ్రేణులను ఆదేశించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందని గాలి అన్నారు.