: ఇది తెలుగుజాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరాటం: కొణతాల
హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాసంలో వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై మండిపడ్డారు. తెలుగుజాతిని నిలువునా చీల్చిన ఘనత సోనియాదని దుయ్యబట్టారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభతో.. తెలుగుజాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరాటం ఆరంభమైందని స్పష్టం చేశారు.