: బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం: రఘువీరా
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము అన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నామని అందరినీ ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న బాపట్ల గాయత్రీనగర్ వాసులు తమ కష్టాలను మంత్రికి ఏకరువు పెట్టారు. గతంలోనూ ఇలానే చాలా హామీలు ఇచ్చారని, అవి నెరవేరలేదని వారు నిలదీశారు. వరదబాధితులను పరామర్శిస్తున్న మంత్రి రఘువీరా వెంట టీజీ వెంకటేశ్, కాసు, డొక్కా, గాదె తదితరులున్నారు.