: శంఖారావం సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు
ఎల్బీ స్టేడియంలో ఈ మధ్యాహ్నం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. అలాగే, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టారు. ఈ వివరాలను వైఎస్సార్సీపీ ప్రకటించింది.
దీంతోపాటు, సభకు హాజరవుతున్న వారికోసం వివిధ ద్వారాలు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఫతేమైదాన్ వైపున్న ఏ గేట్, వీఐపీల కోసం నిజాం క్లబ్ వైపున్న ఎఫ్ గేట్, వీవీఐపీల కోసం కేఎల్ కే బిల్డింగ్ వైపున్న డీ గేట్ ఏర్పాటు చేశారు. అలాగే, ప్రజల కోసం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వైపున్న ఎఫ్1 గేట్, ఆయకార్ భవన్ వైపున్న జీ గేట్ ను ఏర్పాటు చేశారు.