: లింగ నిర్ధారణ చట్టం కఠినంగా అమలుచేస్తాం: మంత్రి డీఎల్
రాష్ట్రంలో లింగ నిర్థారణ చట్టం కఠినంగా అమలు చేస్తామని మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. పీసీపిఎన్డీటీ చట్టంపై ఈరోజు సచివాలయంలో మంత్రి డీఎల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బాలికల నిష్పత్తి క్రమేణా తగ్గిపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
కాగా, లింగ నిర్ధారణ చట్టం అమలులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నట్టు అధికారులు మంత్రికి తెలియజేశారు. దీనిపై స్పందిస్తూ, ఇక నుంచి ఈ చట్టం అమలులో కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో చర్యలు తీసుకుంటామని డీఎల్ పేర్కొన్నారు.